Mouni Roy Announces: షాకింగ్: భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించిన మౌనీరాయ్
విడిపోతున్నట్లు ప్రకటించిన మౌనీరాయ్

Mouni Roy Announces: సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతాయో.. విడిపోవడాలు కూడా అంతే సంచలనంగా మారుతుంటాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన నటి మౌనీరాయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. మౌనీరాయ్ తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు.
వీరిద్దరూ తమ సోషల్ మీడియా వేదికగా విడాకుల విషయాన్ని ధృవీకరించారు. పరస్పర అంగీకారంతోనే తాము సెపరేట్ అవుతున్నామని, తమ మధ్య ఉన్న బంధానికి స్వస్తి పలుకుతున్నామని వారు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత స్వేచ్ఛను (Privacy) గౌరవించాలని వారు అభిమానులను, మీడియాను కోరారు. ముఖ్యంగా తమ ఇద్దరి గురించి ఎలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని, కేవలం వాస్తవాలను మాత్రమే నమ్మాలని వారు విజ్ఞప్తి చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నిజానికి వీరి బంధం విచ్ఛిన్నం కాబోతోందని కొన్ని రోజుల ముందే అనుమానాలు మొదలయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ జంట ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో విడాకుల ప్రచారం ఊపందుకుంది. అయితే, ఆ సమయంలో మౌనీరాయ్ స్పందిస్తూ.. అవాస్తవాలను ప్రచారం చేయవద్దని కోరుతూ బుధవారం ఒక పోస్ట్ పెట్టారు. కానీ, చివరకు ఆ ప్రచారమే నిజమైంది. 2022 జనవరిలో దుబాయ్ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను మౌనీ వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు నుంచే వీరిద్దరికీ మంచి పరిచయం ఉంది. కానీ రెండేళ్లు తిరగకముందే ఈ బంధం ముగిసిపోవడం పట్ల ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాగిని’ సీరియల్‌తో బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న మౌనీరాయ్.. ‘గోల్డ్’, ‘బ్రహ్మాస్త్ర’ వంటి భారీ చిత్రాలతో వెండితెరపై కూడా తన సత్తా చాటారు.

