YouTuber Komali Suicide Case: యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు
సంచలన విషయాలు

YouTuber Komali Suicide Case: యూట్యూబర్ కోమలి (బోను కోమలి) ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఆత్మహత్యకు ముందు ఆమె కువైట్‌లో ఉంటున్న తన తల్లికి వాట్సాప్ మెసేజ్ పంపింది. అందులో "ఐ లవ్ యూ మమ్మీ.. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో" అని తెలిపింది.
విశాఖపట్నానికి చెందిన 21 ఏళ్ల కోమలి, హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతోంది. చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్, మణికొండలోని చిత్రపురి కాలనీలో తన బంధువుల ఇంట్లో నివసిస్తున్న కోమలి, ఫిబ్రవరి 23 (సోమవారం) నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని తెలుస్తోంది. నిఖిల్ రెడ్డి (అఖిల్) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో ఆమె మూడేళ్లుగా ప్రేమలో ఉంది. ఏడాది క్రితం వీరిద్దరూ విడిపోయినప్పటికీ, ఆమె అతన్ని మర్చిపోలేక తీవ్ర మనోవేదనకు గురైంది.
గతంలో ఆమె తిరుమల కొండపై ప్రతి మెట్టుకు బొట్టు పెడుతూ చేసిన పాదయాత్ర వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అదే ఆమె చివరి వీడియోగా మిగిలిపోవడం భక్తులను, అభిమానులను కలిచివేస్తోంది. రాయదుర్గం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కోమలి డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులో తన ప్రేమ విఫలం గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. నిఖిల్ రెడ్డి (అఖిల్)ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

