వేతనాల పెంచాలని డిమాండ్‌ చేస్తూ షూటింగులు నిలివేసిన సినీ కార్మికులు

చిత్రపరిశ్రమకు చెందిన కార్మికుల వేతనాల పెంచాలంటూ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సమ్మెకు దిగింది. 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ… పెంచే వరకూ సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల షూటింగ్‌లకు హాజరుకాకూడదని ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నిర్ణయం తీసుకుంది. అయితే ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని పట్టించుకోకుండా మైత్రీ మూవీ మేకర్స్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నిర్మిస్తున్న సినిమాకు సంబంధించి అన్నపూర్ణా స్టూడియోలో జరుగుతున్న షూటింగ్‌కు ముంబయ్‌ నుంచి టెక్నీషియన్లను తీసుకు వచ్చారు. ఈ విషయం తెలిసిన తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ యూనియన్‌ కార్యాలయం ముందు పెద్దపెట్టున ఆందోళనకు దిగారు. అయితే ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌పై ఫిలింఛాంబర్‌లో సమావేశమైన నిర్మాతల మండలి చర్చలు జరుపుతోంది. నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రీ రవి, సురేష్ బాబు, శివలెంక కృష్ణాప్రసాద్, రాధామోహన్, బాపినీడు, ఠాగూర్ మధు, ఫెడరేషన్ సభ్యులు, ఫిలిం ఛాంబర్ సభ్యులు ఈ సమావేశానికి హాజరై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే సినీ కార్మికులకు కనీస వేతనం కంటే ఎక్కువ ఇస్తున్నామని ఇప్పుడ 30 శాతం వేతనాలు పెంచమని డిమాండ్‌ చేయడమేంటని ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ మండిపడుతోంది. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ పక్షపాతంగా వ్యవహరిస్తోందని 30 శాతం వేతనాలు పెంచమని అడగం బాధ్యతా రాహిత్యమని నిర్మాతల మండలి అభిప్రాయపడుతోంది.

Politent News Web 1

Politent News Web 1

Next Story