Shraddha Das : గణేశ్ నిమజ్జన వేడుకల్లో.. తీన్మార్ స్టెప్పులేసిన శ్రద్ధాదాస్
తీన్మార్ స్టెప్పులేసిన శ్రద్ధాదాస్

Shraddha Das : గణేశ్ నిమజ్జన వేడుకల్లో నటి శ్రద్ధాదాస్ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. తన అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జనంలో పాల్గొని, డోలు వాయిస్తూ, తీన్మార్ స్టెప్పులతో సందడి చేశారు. వర్షం పడుతున్నా సరే, ఆమె డ్యాన్స్ ఆపలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు ఆమె ఎనర్జీని చూసి షాకవుతున్నారు.
శ్రద్ధా దాస్ మార్చి 4, 1987న ముంబైలో బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ఆమె జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీని పొందారు. 2008లో అల్లరి నరేష్ నటించిన 'సిద్ధు ఫ్రం శ్రీకాకుళం' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె 'ఆర్య 2' డార్లింగ్' వంటి చిత్రాలలో సహాయక పాత్రలలో నటించి మంచి గుర్తింపు పొందారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం,బెంగాలీ భాషా చిత్రాలలో కూడా నటించారు.
ఆమె ప్రస్తుతం బుల్లితెర డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు మరియు కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తున్నారు. ఆమె త్వరలో 'త్రికాల' అనే హారర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
