Shraddha Kapoor : ఈఠా సెట్స్ గాయంపై శ్రద్ధాకపూర్ అప్‌డేట్
శ్రద్ధాకపూర్ అప్‌డేట్

Shraddha Kapoor : ఈథా సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో ఫన్నీగా స్పందించారు. గాయం కారణంగా ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ బయోపిక్‌లో లెజెండరీ తమాషా కళాకారిణి విఠాబాయి పాత్ర పోషిస్తున్న శ్రద్ధా, ఇటీవల లావణి డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో తన ఎడమ కాలికి ఫ్రాక్చర్ చేసుకున్నారు. ఈ ప్రమాదంలో కాలుకు గాయం కావడంతో, ఆమెకు వైద్యులు రెండు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. గాయంపై శ్రద్ధా కపూర్ స్పందిస్తూ, తాను నడవడానికి ఉపయోగిస్తున్న పరికరాన్ని ఉద్దేశిస్తూ... "టర్మినేటర్ కి తరహ్ ఘూమ్ రహీ హూ..." (నేను టెర్మినేటర్ లాగా తిరుగుతున్నాను) అని సరదాగా పోస్ట్ చేసింది. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత రెండు వారాల్లో షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ పాత్ర కోసం శ్రద్ధా 15 కిలోలకు పైగా బరువు పెరిగి, సంప్రదాయ లావణి నృత్యాన్ని నేర్చుకుంటున్నారు. గాయం నుంచి శ్రద్ధా త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. కాగా 'తమాషా సామ్రాదిని'గా పిలువబడే వితాబాయి, మహారాష్ట్ర జానపద నృత్యానికి ఆమె చేసిన కృషికి 1957 ,1990లో రాష్ట్రపతి అవార్డును గెలుచుకుంది.

