నిలిచిపోయిన ఈతా బయోపిక్

Shraddha Kapoor: బాలీవుడ్ ప్రముఖ నటి శ్రద్ధా కపూర్, తాను ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈతా బయోపిక్ షూటింగ్ సెట్‌లో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె కాలికి ఫ్రాక్చర్ కావడంతో సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. లక్ష్మణ్ ఉటేకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్రద్ధా ఓ పాట చిత్రీకరణలో డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బ్యాలెన్స్ కోల్పోయి కిందపడింది.

బరువు, నౌవారీ చీర భారంతోనే ప్రమాదం

ఈ బయోపిక్‌లో మహారాష్ట్ర తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణగావ్కర్ పాత్ర పోషిస్తున్న శ్రద్ధా, పాత్ర కోసం 15 కిలోలకు పైగా బరువు పెరిగారు. అంతేకాకుండా నౌవారీ చీర, బరువైన ఆభరణాలు ధరించి డ్యాన్స్ చేస్తుండగా, శరీర బరువు మొత్తం ఎడమ కాలిపై పడటం ఈ ప్రమాదానికి కారణమైంది.

ప్రమాదం జరిగిన తర్వాత శ్రద్ధా ముంబైకి తిరిగి వచ్చి కొన్ని ఎమోషనల్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంది. అయితే నొప్పి ఎక్కువ కావడంతో చిత్ర యూనిట్ షూటింగ్‌ను నిలిపివేసింది. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత రెండు వారాలకు చిత్రీకరణ తిరిగి ప్రారంభమవుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు.

ఎవరి జీవితం ఆధారంగా ‘ఈతా’ బమావతారం?

ఈ ఈతా బయోపిక్ తమాషా సామ్రాజ్ఞిగా పేరుగాంచిన మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణగావ్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఆమె జానపద నృత్యానికి చేసిన సేవలకు గాను 1957, 1990లలో రాష్ట్రపతి అవార్డులను అందుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story