Shruti Haasan: సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్‌. నటనతోనే కాకుండా గాయనిగా, సంగీత దర్శకురాలిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న ఈ స్టార్ కిడ్, ఎప్పుడూ తన మనసులోని మాటను బోల్డ్‌గా చెప్పడానికే ఇష్టపడుతుంది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన శ్రుతి, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. "మీరు ఇప్పుడు ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?" అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శ్రుతి హాసన్ స్పందిస్తూ, తను ప్రస్తుతం ఏ బంధంలోనూ లేనని స్పష్టం చేసింది.

ఒకవేళ సినిమా రంగానికి రాకపోయి ఉంటే ఏం చేసేవారన్న ప్రశ్నకు.. తాను ఒక చైల్డ్ సైకాలజిస్ట్ అయ్యేదాన్ని అంటూ సరికొత్త విషయాన్ని బయటపెట్టింది. లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి, ఇటీవల రజనీకాంత్‌తో కలిసి కూలీ చిత్రంలో నటించి మెప్పించింది. అలాగే విజయ్ సేతుపతి సరసన ఆమె నటించిన ట్రైన్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

Next Story