విజయ్‌ను ‘జోకర్’తో పోల్చి.. ‘ఆయన్ని తప్పుపట్టకండి’ అంటూ ఇన్‌స్టా పోస్ట్

Shruti Haasan's Satirical Insta Post Goes Viral: తమిళ సినిమా హీరో, 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధ్యక్షుడు తలపతి విజయ్‌పై హీరోయిన్ శృతి హాసన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇటీవల కరూర్‌లో జరిగిన టోక్కిసలాట దుర్ఘటనలో 41 మంది మరణించిన సంఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ, 'ఓ జోకర్ సర్కస్‌కు వెళ్లడం వల్లే ఈ ఘోరం జరిగింది' అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

విజయ్ ఒక జోకర్ మాత్రమేనని, అతన్ని జోకర్‌గానే వదిలేయాలని, ఆయన్ని తప్పుపట్టకూడదని శృతి స్పష్టం చేశారు. సర్కస్‌కు వెళ్లినవారినే వేలెత్తి చూపాలని కూడా పేర్కొన్నారు. అయితే, ఈ పోస్ట్‌ను చేసిన కొద్ది నిమిషాల్లోనే తొలగించినప్పటికీ, అది సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెంది వైరల్ అయింది.

ఈ ఘటన మధ్యలో, కరూర్ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలతో విజయ్ సోమవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జరిగిన నష్టాన్ని పూర్తిగా పూడ్చలేమని, కానీ తను జీవితాంతం వారి అండగా ఉంటానని ఓదార్చారు.

గతంలో 'పులి' సినిమాలో విజయ్, శృతి హాసన్ జంటగా నటించి, విశేష గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ సెటైర్ వల్ల సినిమా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story