Shwetnagu Movie: శ్వేతనాగు సినిమా రచయిత కన్నుమూత
సినిమా రచయిత కన్నుమూత

Shwetnagu Movie: ప్రముఖ నవలా రచయిత, సినీ రచయిత అయిన లల్లా దేవి గారు (పరుచూరి నారాయణాచార్యులు) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అక్టోబరు 3, 2025 తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు సుమారు 80 సంవత్సరాలు.ఆయన రాసిన కొన్ని నవలలు సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి. దివంగత నటి సౌందర్య 100వ చిత్రంగా వచ్చిన 'శ్వేతనాగు' (2004) ఆయన నవల ఆధారంగానే తెరకెక్కింది. అలాగే, నందమూరి తారక రామారావు నటించిన 'సామ్రాట్ అశోక్' సినిమా కూడా ఆయన రచన ఆధారంగా రూపొందించబడింది. పాములపై లోతైన పరిశోధన చేసి రచనలు చేసిన ఏకైక రచయితగా ఆయనకు పేరుంది. ఆయన మృతి పట్ల తెలుగు సాహితీ, సినీ లోకం సంతాపం వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకి పరుచూరి నారాయణాచార్యులు అత్యంత సన్ని హితులు. కొంతకాలం ఆయన దగ్గర కార్యదర్శిగా కూడా పనిచేశారు. ’లల్లాదేవి’ మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేశారు. ’లల్లాదేవి’ స్వగ్రామం గుంటూరు జిల్లా పత్తిపాడు సమీపంలోని నిమ్మగడ్డవారి పాలెం. ఆయన కొన్ని వందల కథలు, నవలలు, నాటికలు, నాటకాలు రాశారు.
