సిద్ధార్థ్ కల విజయవంతం

Siddharth: తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేశాడు నటుడు సిద్ధార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ సక్సెస్ తో హైదరాబాద్ కు స్థావరం మార్చుకుని, ప్రధానంగా తెలుగు చిత్రాలలో కెరీర్ను కొనసాగించాడు. మహా సముద్రం మూవీలో అదితి రావు హైదరి సరసన అవినీతిపరుడైన సివిల్ సర్వీసెస్ ఆకాంక్షకుడిగా నటించాడు. ఆ సమయంలోనే ఇద్దరూ డేటింగ్ చేశారు. ఈ జంట 2024 మార్చి 28న తమ నిశ్చితార్థాన్ని ప్రకటించింది. అదే ఏడాది సెప్టెంబర్ 16న వన పర్తిలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట దూకుడు తగ్గించారు. వరుసగా సినిమాలు చేయడం లేదు. తాను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని, సొంత ఇల్లు కొనుక్కోవాలని తన తల్లిదండ్రులు చాలా కాలంగా కోరుకున్నట్టు సిద్ధార్థ్ చెప్పాడు. ఇన్నేళ్లలో అసలు తనకు ఆస్తులు ఏవీ లేవన్నాడు. కనీసం ఇల్లు కూడా కొనుక్కోలేదని తెలిపాడు. పెళ్లి తర్వాత ఇప్పుడు కొత్త ఇంటిని సిద్దు కొనుక్కున్నాడు. ఈ జంట తమ డ్రీమ్ హౌస్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించారని తెలిసింది. మాది అనే నేమ్ ప్లేట్ తో కూడిన ఇల్లు మాకు కావాలి.. చివరికి ఆ కల నెరవేరిందని ఇప్పుడు ఈ జంట ఆనందంగా ఉంది. కాగా సిద్ధార్థ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ '3 బీహెచ్‌కే'. ఇందులో శరత్‌ కుమార్‌, దేవయాని, యోగి బాబు, మీటా రఘునాథ్, చైత్ర కీలక పాత్రలు పోషించారు. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. శాంతి టాకీస్ బ్యానర్ లో అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story