యూత్‌కు సిద్ధు జొన్నలగడ్డ సలహాలు

Siddu Jonnalagadda: టాలీవుడ్‌ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా మూవీ రిలీజ్ సిద్ధమైంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు నీరజ కోన దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్యంగా యువతకు, ముఖ్యంగా అబ్బాయిలకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పారు.

ఈ సృష్టికి మూలం మహిళలే అని, వారి ముందు తాము నిమిత్తమాత్రులమని సిద్ధు పేర్కొన్నారు. తాము ఏవైనా పొరపాట్లు చేస్తే పెద్ద మనసుతో క్షమించాలని మహిళలను కోరారు. లవ్‌ బ్రేకప్‌ అయినప్పుడు అబ్బాయిలు ఎలా ఉండాలో సిద్ధు సలహా ఇచ్చారు. ఒక అమ్మాయి మనసు విరిచి వెళ్లిపోతే, ఆమెను వెళ్లనివ్వాలని సిద్ధు అన్నారు. ఆమెను వెనక్కి రమ్మని వెంటపడితే ఆత్మగౌరవాన్ని కోల్పోతారని హెచ్చరించారు. ఎంత వెంటపడితే అంత మర్యాద పోతుందని తెలిపారు.

అమ్మాయి దూరమైతే బాధ కలగడం, ఏడవడం సహజమేనని, బాధపడడంలో తప్పు లేదని సిద్ధు చెప్పారు. అయితే ఆ సమయంలోనే తెలుసు కదా చిత్రంలోని హీరో వరుణ్ లాంటి ధైర్యం మనలో నుంచి వస్తుందని తెలిపారు. మన భావోద్వేగాలు ఎప్పుడూ మన అదుపులో ఉండాలని సిద్ధు యువతకు సూచించారు. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే తమ సినిమా తెలుసు కదా చూడాలని, హీరో వరుణ్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాడని సిద్ధు చెప్పుకొచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story