SIIMA Awards Nominations: దక్షిణాది చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్' (సైమా 2026) వేడుకలకు రంగం సిద్ధమైంది! గతేడాది అంటే 2025లో బాక్సాఫీస్‌ను అలరించిన పలు చిత్రాలు వివిధ కేటగిరీల్లో నామినేషన్లు దక్కించుకోగా... గురువారం సైమా అవార్డుల కమిటీ అధికారిక జాబితాను విడుదల చేసింది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి తేజ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ 'మిరాయ్' సంచలనం సృష్టించింది. రూ.140 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, సైమా అవార్డుల్లో ఏకంగా 11 నామినేషన్లను దక్కించుకుని టాప్ ప్లేస్‌లో నిలిచింది.

ఇక వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ 10 నామినేషన్లతో తర్వాతి స్థానంలో నిలవగా... యువ నటుడు నాగచైతన్య నటించిన 'తండేల్', అలాగే చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించిన 'కోర్టు' సినిమాలు చెరో 9 నామినేషన్లను సొంతం చేసుకున్నాయి.

దక్షిణాది నాలుగు భాషలకు సంబంధించి అత్యుత్తమ చిత్రాలు, నటీనటుల నామినేషన్ల ప్రకటనతో సినీ వర్గాల్లో జోష్ మొదలైంది. సెప్టెంబరు 11, 12 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనున్న ఈ సైమా వేడుకల్లో... ఏ సినిమాలు ఏయే అవార్డులను గెలుచుకుంటాయనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story