Singeetam Directed: భారతీయ సినీ చరిత్రలో 'ప్రయోగం' అనే పదానికి నిలువెత్తు రూపంగా నిలిచిన విలక్షణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. మాటలు లేని సినిమా ‘పుష్పక విమానం’తో మూకీ యుగాన్ని గుర్తుచేసినా, ‘ఆదిత్య 369’తో తెలుగు తెరకు టైమ్ ట్రావెల్‌ను పరిచయం చేసినా అది ఆయనకే సాధ్యమైంది. సుమారు దశాబ్ద కాలం విరామం తర్వాత, 94 ఏళ్ల వయసులో ఆయన మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన సరికొత్త విజువల్ మ్యూజికల్ ఫాంటసీ చిత్రం 'సింగ్ గీతం'.

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మీడియా ముందుకు వచ్చి సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన సాంకేతిక రహస్యాలను, విశేషాలను పంచుకున్నారు.

40 ఏళ్ల నాటి కల సాకారం

"ప్రేక్షకులు మాట్లాడే ప్రతి సంభాషణ (డైలాగ్) ఒక పాట రూపంలోనే సాగే పూర్తి స్థాయి మ్యూజికల్ సినిమా చేయాలనేది నా 40 ఏళ్ల నాటి కల. దశాబ్దాలుగా నా మనసులోనే ఉన్న ఈ ఆలోచనను నాగ్ అశ్విన్ వినగానే ఎంతో ఇష్టపడ్డారు. ఈ చిత్రాన్ని నేనే డైరెక్ట్ చేయాలని ఆయన పట్టుబట్టారు" అని సింగీతం తెలిపారు.

ఇంటి నుంచే ఆన్‌లైన్ డైరెక్షన్!

94 ఏళ్ల వయసులో షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి రోజూ పనిచేయడం శారీరకంగా ఎంతో సవాల్‌తో కూడుకున్న పని. దీనికోసం నిర్మాత నాగ్ అశ్విన్ ఒక అద్భుతమైన సాంకేతిక విప్లవాన్ని ఉపయోగించారు. లొకేషన్‌లో షూటింగ్ జరుగుతుండగా, సింగీతం శ్రీనివాసరావు తన నివాసంలోని హోమ్ థియేటర్‌లో కూర్చుని ఆన్‌లైన్ ద్వారా కనెక్ట్ అయ్యారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story