Singer Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్... అమ్మాయి గురించి ఈ విషయాలు తెలుసా?
అమ్మాయి గురించి ఈ విషయాలు తెలుసా?

Singer Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన ప్రేయసి హరిణ్య రెడ్డితో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 17న హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో ఈ కార్యక్రమం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. హరిణ్య రెడ్డికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హరిణ్య రెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్. ఆమె నెల్లూరుకు చెందిన వారని సమాచారం. ఈమె మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేశారు. గతంలో బిగ్ బాస్ షోను నిర్మించే ఎండమోల్ షైన్ ఇండియా కంపెనీలో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.
ఆమె ఒకప్పుడు టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె. ఈ విషయాన్ని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా ప్రైవేట్‌లో ఉంచుకున్నారు.
ప్రస్తుతానికి వారి వివాహ తేదీ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య రెడ్డి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
