Sita app is a boon for women - Srileela
మహిళల అభ్యున్నతి కోసమే రూపొందించిన సీతా యాప్ మహిళలకు ఓ వరమని ప్రముఖ నటి శ్రీలీల చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఈ యాప్ ద్వారా మహిళలు ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకునే అవకాశం పొందుతున్నారని, ట్యూటరింగ్, నెయిలింగ్, బ్యూటీ సర్వీసులు వంటి పలు గిగ్ పనులు చేయడం ద్వారా ఆర్థికంగా స్వతంత్రంగా మారుతున్నారని, ఇది నిజమైన ఆత్మనిర్బర్‌కు నిదర్శనమని శ్రీలీల వ్యాఖ్యానించారు. సీతాయాప్ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీలీల పొలిటెంట్ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
అమ్మదనం గురించి శ్రీలీల స్పందిస్తూ.. తాను పిల్లలకు జన్మ ఇవ్వలేదు గాని, అమ్మతనం అనేది ఒక మైండ్‌సెట్ అని, బాధ్యతను పంచుకోవచ్చని చెప్పారు. తమ తల్లి.. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారని గుర్తు చేసుకున్నారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలుగుతారని శ్రీలీల చెప్పారు.
సీతా యాప్ వేదికగా మహిళలు పరస్పరం కనెక్ట్ కావచ్చని, దీని వల్ల మంచి అవకాశాలను గుర్తించి, తమకు తగినట్లు ఉపయోగించుకోవచ్చని, ఇది సురక్షితమైన మార్గం అని చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఈ యాప్ వాడకం కూడా చాలా సులభమని చెప్పారు.
తన పుట్టినరోజును ఇంట్లో సాదా సీదాగా జరుపుకుంటామని శ్రీలీల చెప్పారు. ఒక్క పని మాత్రమే కాదు. ఒకేసారి అనేక పనులు చేయగలగడం సీతా యాప్ అందించే ముఖ్యమైన ప్రయోజనమని శ్రీ లీల తెలిపారు. ఇటీవలే తాను ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు శ్రీలీల వెల్లడించారు. త్వరలో తన తదుపరి ప్రాజెక్టును ప్రకటిస్తానని పొలిటెంట్ మీడియాకు చెప్పారు. ఇది తన బర్త్‌డే అని.. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
