ఏనుగును దత్తత తీసుకున్న స్టార్ హీరో..

Sivakarthikeyan: సినిమా తెరపైనే కాదు, నిజజీవితంలోనూ తాను హీరోనని శివ కార్తికేయన్ నిరూపించుకున్నారు. చెన్నై సమీపంలోని వండలూర్ జూ పార్క్‌‌లో ఉన్న ఒక ఏనుగును ఆయన దత్తత తీసుకున్నారు. శివ కార్తికేయన్ దత్తత తీసుకున్న ఆ ఏనుగు పేరు ప్రకృతి. రాబోయే ఆరు నెలల పాటు ఆ ఏనుగుకు కావాల్సిన ఆహారం, వైద్యం, ఇతర సంరక్షణ ఖర్చులను ఆయనే స్వయంగా భరించనున్నారు. జూ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద పరాశక్తి సందడి

వృత్తిపరంగా చూస్తే, శివ కార్తికేయన్ ప్రస్తుతం తన తాజా చిత్రం పరాశక్తి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం ఈ నెల 10న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, ఈ చిత్రంలోని కొన్ని అంశాలను రాజకీయాలతో ముడిపెట్టడంతో చిన్నపాటి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story