Special GO for OG: OG కి స్పెషల్ GO..ఒక్కరోజు ముందుగానే థియేటర్లకు
ఒక్కరోజు ముందుగానే థియేటర్లకు

Special GO for OG: ఓజీ' సినిమా ప్రిమియర్ షోలు సెప్టెంబర్ 24, 2025 నుంచే ప్రారంభమవుతాయి. సాధారణంగా పెద్ద సినిమాలకు విడుదల తేదీకి ముందు రోజు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున ప్రిమియర్లు వేస్తారు.'ఓజీ' విషయంలో ఈ ప్రిమియర్ల కోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా జీవోలు జారీ చేశాయి.
తెలంగాణలో సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచే పెయిడ్ ప్రిమియర్లు నిర్వహించుకునేందుకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్ లో మొదట సెప్టెంబర్ 25వ తేదీ తెల్లవారుజామున 1 గంటకు అనుమతించారు, అయితే తర్వాత ఈ సమయాన్ని సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 10 గంటలకు మార్చారు.
దీనివల్ల తెలుగు రాష్ట్రాలలోని పవన్ కల్యాణ్ అభిమానులు సినిమాను ఒక రోజు ముందే చూసే అవకాశం లభించింది. ఈ ప్రిమియర్ షోలకు టికెట్ల ధరలు కూడా పెంచడానికి ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. సినిమా అధికారికంగా సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
