ఢిల్లీలో అఖండ 2 స్పెషల్ షో

Special Screening of Akhanda 2 in Delhi: అఖండ 2: తాండవం విజయోత్సవ కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను తనదైన శైలిలో భావోద్వేగంగా మాట్లాడారు. 'అఖండ 2' కేవలం సినిమా కాదని, ఇది పరమశివుడే మీ ముందుకు వచ్చి సందేశం ఇచ్చినట్లు ఉంటుందని, ఈ విజయం వెనుక దైవ శక్తి ఉందన్నారు. 'అఖండ 2' ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో చెందిన సినిమా కాదని, దేశ ప్రజలంతా తప్పక చూడాల్సిన చిత్రమని ఆయన ఉద్వేగంగా చెప్పారు.

ఈ సినిమాను ఒక సనాతన ధర్మం అనే వేదికపై నిర్మించామని, ఇది కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసే మంచి సినిమా అని తెలిపారు.

బాలకృష్ణ శక్తి, ఆయన నటన లాజిక్‌కు అతీతం (నో లాజిక్) అని, ఎందుకంటే 'అఖండ' పాత్ర అష్టసిద్ధి సాధించిన సూపర్ హ్యూమన్ అని, అలాంటి వ్యక్తికి లాజిక్ అవసరం లేదన్నారు . మాస్‌కి కొత్త అర్థం చెప్పింది బాలకృష్ణనే అని, ఆయన చేసిన ప్రతి స్టంట్, ప్రతి డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోందని అన్నారు. డూప్ లేకుండా బాలయ్య గారు స్టంట్స్ చేశారని ప్రశంసించారు. బాలయ్య నిజ జీవితంలోనూ, సినిమాలోనూ నాయకుడిగా ఎప్పుడూ ముందుండి నడిపిస్తారని, ఆయన సహకారం లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదని కృతజ్ఞతలు తెలిపారు.

సినిమా విజయానికి, జాతీయ భావానికి గుర్తుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం ఈ సినిమాను ఢిల్లీలో ఒక ప్రత్యేక ప్రదర్శన వేయాలని అనుకుంటున్నట్లు ప్రస్తావించారు. ఈ సినిమాలో తన ఇద్దరు కుమారులు భాగమయ్యారని, పెద్ద కుమారుడు హర్షిత్ కాన్సెప్ట్ డిజైన్‌లో, చిన్న కుమారుడు వర్షిత్ ప్రహ్లాదుడి పాత్రలో నటించారని తెలియజేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story