తెలుగు సినిమాకు గర్వకారణం

విష్ణు మంచు ప్రధాన పాత్రలో డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన చారిత్రక ఇతిహాసం ‘కన్నప్ప’ను ఇటీవల న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు. శివ భక్తుడైన భక్త కన్నప్ప చరిత్రను మరోసారి చూసి వారంతా మురిసిపోయారు.

ఈ చిత్రానికి ప్రముఖుల నుండి అద్భుతమైన సానుకూల స్పందన వచ్చింది. ‘కన్నప్ప’ చిత్రంలోని భావోద్వేగాలు, విజువల్స్, ఆధ్యాత్మిక భావనల్ని ప్రశంసించారు. ‘కన్నప్ప’లోని చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉండటంతో పాటుగా ఇది ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే.

విష్ణు మంచు నటన అందరికీ గుర్తుండిపోతుంది. అతని నటన, స్క్రీన్ ప్రజెన్స్ మీద దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ విష్ణు నటన గురించి ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులు, విమర్శకులు, తోటీ ఆర్టిస్టులు, సినీ ప్రముఖులు ఇలా అందరూ విష్ణు గురించి మాట్లాడుకున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రపతి భవన్‌లో ఈ ప్రత్యేక ప్రదర్శన తెలుగు సినిమాకు గర్వకారణమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ ప్రత్యేక ప్రదర్శనతో వారసత్వం, భక్తి, సినిమాటిక్ ఎక్సలెన్స్‌ను మిళితం చేసిన ఈ చిత్రానికి జాతీయ గుర్తింపు లభించినట్టు అయింది.

Politent News Web 1

Politent News Web 1

Next Story