స్పిరిట్ ఓపెనింగ్

‘Spirit’ Opening: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'స్పిరిట్' ముహూర్తపు వేడుక , పూజా కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ఈ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి, చిత్ర బృందానికి ఆశీస్సులు అందించారు.

మెగాస్టార్ చిరంజీవి తొలి సన్నివేశానికి గౌరవ క్లాప్ కొట్టి అధికారికంగా సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ వేడుకకు చిరంజీవితో పాటు, హీరోయిన్ తృప్తి డిమ్రి (ఆమె ఇంతకు ముందు 'యానిమల్'లో సందీప్ వంగాతో కలిసి పనిచేశారు). నిర్మాతలు భూషణ్ కుమార్, వంగా ప్రణయ్, శివ్ చనానా వంటి వారు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్కి ప్రభాస్ కూడా అటెండ్ కాలేదు.

'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటిసారి ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం తెలుగుతో సహా ఏకంగా తొమ్మిది భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది.

సందీప్ రెడ్డి వంగా వరుసగా మూడు బ్లాక్ బస్టర్ల (అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్) తర్వాత చేస్తున్న సినిమా కావడం, అలాగే ప్రభాస్ కూడా ఇందులో పవర్ఫుల్ కాప్ పాత్రలో నటిస్తుండటంతో 'స్పిరిట్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ పాన్ ఇండియా మూవీలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story