అజిత్ కుమార్‌తో జోడీ?

Actress Sreeleela: తమిళ చిత్రసీమలో యువ నటి శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటివరకు అక్కడ ఆమెకు సరైన హిట్ పడకపోయినా, వరుసగా క్రేజీ ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో విడుదలైన ఆమె మొదటి తమిళ చిత్రం “పరాశక్తి” ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ, ఆమె చేతిలో ప్రస్తుతం ధనుష్ సినిమా ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ సరసన నటించే భారీ ఛాన్స్ శ్రీలీలను వరించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అజిత్ కుమార్ తన పూర్తి దృష్టిని కార్ రేసింగ్‌పై పెట్టారు. అందుకే ఆయన సినిమాలు చేయడం చాలా తగ్గించేశారు. అయితే, రీసెంట్‌గా “గుడ్ బ్యాడ్ అగ్లీ” చిత్ర దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో మరో సినిమా చేయడానికి అజిత్ ఓకే చెప్పినట్లు టాక్. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం దర్శకుడు శ్రీలీలను సంప్రదించినట్లు సమాచారం.

నిజానికి అజిత్ కుమార్‌కు, శ్రీలీలకు మధ్య దాదాపు 30 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. గత కొన్ని ఏళ్లుగా అజిత్ ఎక్కువగా త్రిష, నయనతార, మంజు వారియర్ వంటి సీనియర్ హీరోయిన్లతోనే జతకడుతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీలీల ఆయన సినిమాలో కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. మరి ఆమె అజిత్ సరసన హీరోయిన్‌గా కనిపిస్తుందా లేక మరేదైనా ముఖ్యమైన పాత్రలో నటిస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు, శ్రీలీల బాలీవుడ్‌లో కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story