'Daredevil': అజిత్‌తో శ్రీలీల జోడీ: గ్రాండ్‌గా మొదలైన డేర్ డెవిల్
డేర్ డెవిల్

'Daredevil': టాలీవుడ్లో దూసుకుపోతున్న యువ నటి శ్రీలీల కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో సత్తా చాటుతున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సరసన నటించే భారీ ప్రాజెక్ట్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న సరికొత్త చిత్రం డేర్ డెవిల్ లో శ్రీలీల కథానాయికగా ఎంపికయ్యారు. గత కొద్ది రోజులుగా దీనిపై వచ్చిన వార్తలకు తెరదించుతూ, చిత్ర యూనిట్ సోమవారం అధికారికంగా పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ను ప్రారంభించింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ కాంబో రిపీట్
గతంలో అజిత్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఘన విజయం సాధించగా.. అదే కాంబోలో రూపొందుతోన్న రెండో చిత్రమిది కావడంతో సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, ప్రముఖ నటుడు-దర్శకుడు పార్థిబన్, టాలీవుడ్ కమెడియన్ సునీల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
శాలిని నిర్మాణంలో..
ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే.. అజిత్ సతీమణి శాలిని అజిత్ కుమార్ బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకోనుంది.

