శ్రీలీల బోల్డ్ స్టేట్‌మెంట్.

Sreeleela’s Bold Statement: నటి శ్రీలీల ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ సరసన నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్ర విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ గురించి మనసు విప్పి మాట్లాడారు. కెరీర్ ప్రారంభంలో నెగెటివ్ కామెంట్స్ చూసి తాను ఎంతో బాధపడేదాన్నని, కొన్నిసార్లు ఆ విమర్శలు భరించలేక కన్నీళ్లు కూడా పెట్టుకున్నానని ఆమె నిజాయితీగా అంగీకరించారు. అప్పట్లో ప్రతి చిన్న మాట తనను తీవ్రంగా ప్రభావితం చేసేదని శ్రీలీల గుర్తు చేసుకున్నారు.

అయితే కాలంతో పాటు తనకు అనుభవం, పరిణతి వచ్చాయని, ఇప్పుడు అటువంటి ట్రోల్స్‌ను తాను అస్సలు పట్టించుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. విజయాలు, అపజయాలు రెండింటినీ చూసిన తర్వాత ఏ విమర్శను స్వీకరించాలి, దేనిని వదిలేయాలి అనే విషయంలో తనకు స్పష్టత వచ్చిందని చెప్పారు. ఇప్పుడు తాను మానసికగా చాలా బలంగా తయారయ్యానని, నెగెటివిటీకి దూరంగా ఉంటూ కేవలం తన పని మీద, ఎదుగుదల మీద మాత్రమే దృష్టి పెడుతున్నానని ఆమె వివరించారు. ఈ రకమైన 'ఇమ్యూనిటీ' (నిరోధకత) పెంచుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని శ్రీలీల పేర్కొన్నారు.

ప్రస్తుతం శ్రీలీల చేతి నిండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు తమిళంలో రెండు సినిమాలు, హిందీలో రెండు భారీ ప్రాజెక్టులు ఆమె లైనప్‌లో ఉన్నాయి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. ట్రోల్స్ చేసే వారి గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోవడం కంటే, తనను ప్రేమించే ప్రేక్షకుల కోసం కష్టపడటమే మిన్న అని ఈ యంగ్ బ్యూటీ తన అభిప్రాయాన్ని చాటిచెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story