Sridevi Family Gets Major Relief: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుటుంబానికి మద్రాసు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆస్తి వివాదంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్లకు అనుకూలంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే...చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ (ECR) లో సుమారు 4.7 ఎకరాల ఖరీదైన భూమి ఉంది. ఈ భూమిని 1988లో శ్రీదేవి చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అయితే, ఈ ఆస్తిపై తమకు హక్కు ఉందంటూ ముగ్గురు వ్యక్తులు.. చంద్రశేఖరన్ ముదలియార్, నటరాజన్ , శివగామి.. చెంగల్పట్టు కోర్టులో దావా వేశారు. నకిలీ వారసత్వ సర్టిఫికేట్లు సృష్టించి, గత 37 ఏళ్లుగా తామే ఆ ఆస్తిని అనుభవిస్తున్నామని వారు కోర్టును ఆశ్రయించారు.

ఈ వివాదాన్ని విచారించిన మద్రాసు హైకోర్టు జస్టిస్ టి.వి. తమిళ్‌సెల్వి ధర్మాసనం.. సదరు వ్యక్తుల వాదనను తీవ్రంగా తప్పుబట్టింది. అక్రమంగా ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో, ఎటువంటి ఆధారాలు లేని ప్రయోజనం లేని దావాగా దీనిని అభివర్ణించింది. నకిలీ సర్టిఫికేట్లతో హక్కులు కోరడం చెల్లదని స్పష్టం చేస్తూ, చెంగల్పట్టు కోర్టులో ఉన్న కేసును పూర్తిగా కొట్టివేసింది.దీంతో ఈ ఖరీదైన భూమిపై బోనీ కపూర్, ఆయన కుమార్తెలకే పూర్తి హక్కులు ఉన్నాయని తేలిపోయింది. కోర్టు తీర్పుతో శ్రీదేవి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story