SSMB29: ప్రపంచం మాట్లాడుకునే రేంజ్ లో మహేష్, రాజమౌళి సినిమా!
మహేష్, రాజమౌళి సినిమా!

SSMB29: భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది ఎస్ఎస్ రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ఎ స్ఎంబీ 29 చిత్రం. ఇది ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్' మన ఇండియన్ సినిమా కి ఒక కొత్త విజువల్ ట్రీట్ ని అందించింది. ఈ సినిమా విజువల్స్ 'ఆర్ఆర్ఆర్' కి మించిన ట్రీట్ ను మహేశ్ తో తీస్తున్న సినిమాకి రాజమౌళి ప్లాన్ చేశారట. దెబ్బకి వరల్డ్ వైడ్ గా తమ సినిమా కోసం మరోసారి మాట్లాడుకునే రేంజ్ లో ఔట్ పుట్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కెన్యా అడవుల్లో ఇంట్రడక్షన్ సీన్ కోసం జక్కన్న తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సీన్లో యాక్షన్ ఎలి మెంట్స్ ఉండబోతున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎలిమెంట్స్ కోసం వీఎఫ్ఎక్స్ టీమ్, ఇంటర్నేషనల్ టెక్నికల్ క్రూ పనిచేస్తుందని తెలుస్తోంది. మహేష్ బాబు ప్రియాంక చోప్రా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం కెన్యా లొకేషన్స్, ఫారెస్ట్ నేపథ్యం సినిమాకు స్పెషల్ విజువల్ ట్రీట్లు ఇవ్వబోతున్నట్లు సమాచారం.
