Star Actor NTR: తన ఇద్దరు పిల్లలను మహిళల్ని గౌరవించేలా పెంచుతాన్నాడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్. నిన్న బెంగళూరులో ఓ ప్రైవేటు దవాఖాన ప్రారంభోత్స వంలో పాల్గొన్న ఆయన అక్కడి సి బ్బందితో ముచ్చటించాడు. మహిళా దినోత్సవం సందర్భంగా ఓ డాక్టర్... ప్రస్తుతం సమాజంలో స్త్రీలను ఎలా గౌ రవించాలో చెప్పండని అడగగా.. మనిషి పుట్టుకతోనే మహిళలపై గౌరవం మొదలవ్వాలి అని చెప్పాడు.ఈ విషయం పదే పదే గుర్తు చేయడం తనకు నచ్చ దన్నాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆయన మాటలు చాలా స్ఫూర్తిని కలిగించేలా ఉన్నాయని నెటి జన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినీ నటి, యాంకర్ అనసూయ కూడా స్పందించింది. తారక్ మాట్లాడిన వీడియోని ట్యాగ్ చేస్తూ.. మహిళల గురించి ఒక స్టార్ మాట్లాడటం చూడటం చాలా చాలా ఆనందంగా ఉందని పేర్కొంది.

ప్రస్తుతం ఎన్టీఆర్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు 'డ్రాగన్' అనే పేరు వినిపిస్తోంది. మొదట రాజమౌళి ఈ పేరును ప్రస్తావించినప్పటికీ, నిర్మాత రవి యెర్నేని మాత్రం ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, అసలు పేరు ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. ఈ సినిమా షూటింగ్ 2024 మొదట్లోనే స్టార్ట్ కావాల్సి ఉన్నా, రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story