తప్పుగా అర్థం చేసుకున్నారు

Star music composer AR Rahman: స్టార్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన కామెంట్స్‌‌పై బాలీవుడ్‌‌లో వివాదం చెలరేగింది. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌‌లో ప‌‌వ‌‌ర్ షిప్ట్ మారింద‌‌ని సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లోకి పవర్ వెళ్లిందని దీనికి మతపరమైన అంశం ఓ కారణమై ఉండొచ్చని, అలాగే ‘ఛావా’ వంటి కొన్ని ప్రాజెక్టులు విభజనను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి పలువురు రెహమాన్‌‌పై మండిపడ్డారు. ఆదివారం ఈ వివాదం గురించి వివరణ ఇస్తూ రెహమాన్ ఓ వీడియోను విడుదల చేశారు.

తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘భారత్ నాకు ఇల్లు. ఇక్కడే నేను సంగీతాన్ని నేర్చుకున్నా. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలే నాకు గురువులు. నేను ఎప్పుడూ దేశాన్ని లేదా ప్రజలను విమర్శించలేదు. భారత్ నాకు ఎప్పటికీ స్ఫూర్తి. సంగీతం, కళాకారులకు ఇచ్చే గౌరవం తగ్గుతోందన్నదే నా ఉద్దేశం. ఒకప్పుడు సంగీతానికి ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు తగ్గుతోంది, కమర్షియల్ అంశాలే ఎక్కువ అవుతున్నాయి. నా వ్యాఖ్యలను మతంతో ముడిపెట్టి చూడటం సరికాదు’ అని తన మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఒక స్టేడియంలో వేలాదిమంది అభిమానులు ‘మా తుఝే సలామ్’ పాడుతున్న వీడియోను షేర్ చేయడం దేశంపట్ల ఆయనకున్న అంకితభావాన్ని తెలియజేస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story