సమంత ఇంట్రెస్టింట్ కామెంట్స్

Samantha’s Interesting Comments: అగ్ర కథానాయిక సమంత తన 15 ఏళ్ల సినీ ప్రయాణం గురించి, మహిళలను ప్రోత్సహించడం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె నటిగానే కాకుండా, తన పాడ్‌కాస్ట్‌ల ద్వారా ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, తన కెరీర్‌లోని కొత్త అధ్యాయాన్ని గురించి మాట్లాడారు.

"నటీమణులకు కెరీర్ పరంగా తక్కువ సమయం ఉంటుందని నేను భావిస్తాను. స్టార్‌డమ్, కీర్తి, గుర్తింపు ఇవన్నీ ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ ఇవే శాశ్వతం కాదు. స్టార్‌గా కొనసాగుతున్నప్పుడు, కొందరిలోనైనా స్ఫూర్తి నింపగలగాలి. నలుగురిపై ప్రభావం చూపాలని ఎవరికి వారు స్వయంగా అనుకోవాలి" అని సమంత పేర్కొన్నారు.

తన చుట్టూ ప్రోత్సహించే వ్యక్తులు ఉన్నందుకు సంతోషంగా ఉందని, వారు ఎప్పుడూ తనకు మార్గనిర్దేశం చేస్తుంటారని తెలిపారు. ధైర్యంగా ముందడుగు వేసి రిస్క్ తీసుకునే మహిళలే విజయం సాధిస్తారని ఆమె నొక్కి చెప్పారు. "మనల్ని మనం నమ్మినప్పుడే పురోగతి సాధ్యమవుతుంది. దూరదృష్టి ఉన్న ప్రతి మహిళ ముందుకు వచ్చి తమ ఆలోచనలను పంచుకోవాలి, ఎందుకంటే ప్రపంచం వారి నాయకత్వాన్ని కోరుకుంటోంది" అని సమంత అన్నారు.

ప్రస్తుతం సమంత నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు. తన సొంత బ్యానర్‌పై 'శుభం' చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకున్నారు. అలాగే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వరుస పాడ్‌కాస్ట్‌లలో నిపుణులతో వీడియోలు చేస్తూ ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story