అరుదైన ఘనత

Sukumar: పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ కుమార్తె, జాతీయ అవార్డు గ్రహీత సుకృతి వేణి బండ్రెడ్డి మరో అరుదైన ఘనత సాధించారు. ఇప్పటికే 'గాంధీ తాత చెట్టు' చిత్రంతో ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు అందుకుని తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సుకృతి, తాజాగా సంగీత రంగంలో మరో అద్భుతమైన మైలురాయిని స్పృశించారు. ఆమె ప్రతిభ ఇటు జాతీయ స్థాయి నుంచి అటు అంతర్జాతీయ వేదిక వరకు మరోసారి మారుమోగుతోంది.
అమెరికాలోని ప్రసిద్ధ 'బోస్టన్ అంతర్జాతీయ బర్క్‌లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్' సంగీత విభాగంలో సుకృతి వేణి 'ఎన్‌సెంబుల్ ఎక్స్‌లెన్స్ అవార్డు'కు ఎంపికయ్యారు. అంతేకాదు, ఈ కోర్సు కోసం ఆమె ఫుల్ స్కాలర్‌షిప్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 272 మంది చిన్నారులు ఆడిషన్స్ ఇవ్వగా.. కేవలం 14 మందికి మాత్రమే పూర్తి స్కాలర్‌షిప్ లభించింది. ఇందులో విశేషం ఏంటంటే.. సింగర్స్ విభాగం నుంచి ఈ ఫుల్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన ఏకైక విద్యార్థిని మన సుకృతి వేణి కావడం గర్వకారణం.
ఒకవైపు నటనలో జాతీయ స్థాయి ప్రశంసలు అందుకుంటూనే, మరోవైపు సంగీతంలో అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామి సంస్థ నుంచి గుర్తింపు పొందడం సాధారణ విషయం కాదు. కూతురి ఈ అరుదైన విజయంతో దర్శకుడు సుకుమార్ కుటుంబంతో పాటు టాలీవుడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో నటిగా మాత్రమే కాకుండా, సంగీత రంగంలోనూ సుకృతి వేణి మరిన్ని శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నారు.
- SukritiVeniSukritiVeniBandreddiSukumarDaughterSukumarGandhiTathaChettuNationalFilmAwardsNationalAwardBestChildArtistTeluguCinemaTollywoodTeluguActressChildArtistSukritiVeniNationalAwardCelebrityNewsEntertainmentNewsMovieNewsTeluguMoviesLatestTollywoodNewsLatestEntertainmentNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

