Superstar Rajinikanth: వెండితెర మీద మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ తానొక సూపర్ స్టార్ అని రజనీకాంత్ మరోసారి నిరూపించుకున్నారు. అత్యంత నిజాయతీగా వ్యవహరించిన ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని తన నివాసానికి పిలిచి మరీ సత్కరించి అందరి మనసు గెలుచుకున్నారు.

45 తులాల బంగారం.. అలుపెరుగని నిజాయతీ!

చెన్నైకి చెందిన పద్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలు టీ నగర్‌లో విధులు నిర్వహిస్తుండగా, ఆమెకు భారీ స్థాయిలో బంగారం ఉన్న పర్సు దొరికింది. అందులో సుమారు 45 తులాల బంగారు ఆభరణాలు ఉన్నప్పటికీ, ఆమె ఏమాత్రం ఆశపడలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి వాటిని యజమానికి చేరేలా చూశారు. ఆమెలోని ఈ గొప్ప గుణాన్ని మెచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పటికే లక్ష రూపాయల రివార్డును అందజేశారు.

సత్కరించిన తలైవా..

ఈ విషయం తెలిసిన రజనీకాంత్, పద్మను స్వయంగా తన ఇంటికి ఆహ్వానించారు. మంగళవారం ఆమెతో మాట్లాడి, ఆమె నిజాయతీని అభినందిస్తూ ఒక బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. గతంలో కూడా ఐదు రూపాయలకే పరోటాలు అమ్ముతున్న రజనీ శేఖర్ అనే అభిమానికి కూడా తలైవా ఇలాగే బంగారు గొలుసును కానుకగా ఇచ్చి ప్రోత్సహించిన సంగతి తెలిసిందే.

షూటింగ్ అప్‌డేట్స్

వరుస సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్న రజనీకాంత్, సినిమాల పరంగా కూడా జోరు పెంచారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కమల్ హాసన్ నిర్మాణంలో రాబోతున్న మరో సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story