Suriya’s 47th Film: సూర్య 47వ సినిమా టైటిల్ వచ్చేసింది.. నవంబర్ 6న థియేటర్లలోకి!
నవంబర్ 6న థియేటర్లలోకి!

Suriya’s 47th Film: తమిళ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న ఆయన.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూర్య నటిస్తున్న 47వ సినిమాకు ‘సీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
‘సీన్’ టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం ఓ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో సూర్య డీఎస్పీ ఇన్‌బరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. అయితే టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు చూస్తే ఆయన పాత్రకు చూపు సమస్య ఉన్నట్లుగా అనిపిస్తోంది. కానీ దీనిపై చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అసలు సూర్య పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి పెరిగింది.
సూర్య ఇప్పటికే తన కెరీర్‌లో పలుమార్లు పోలీస్ పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా ఆయన నటించిన ‘సింగం’ సినిమాలు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు ‘సీన్’తో మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో సూర్య పాత్ర గతంలో చేసిన పోలీస్ పాత్రలకు భిన్నంగా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ ఏడాది సూర్య ఇప్పటికే రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. కరుప్పు లో మాస్ లుక్‌లో, దైవిక అంశాలతో కూడిన పాత్రలో నటించగా.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో క్లాస్‌గా కనిపించే వ్యాపారవేత్త పాత్ర చేశారు. ఇప్పుడు ‘సీన్’లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
టైటిల్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా చిత్రబృందం ప్రకటించింది. 2026 నవంబర్ 6న ‘సీన్’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే ఒకే ఏడాదిలో సూర్యకు వరుసగా మూడు విజయాలు వచ్చినట్లవుతుంది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
మలయాళ దర్శకుడు జితూ మాధవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, జ్యోతిక కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు.

