సూర్య కరుప్పు

Suriya’s Karuppu: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. కోలీవుడ్ పవర్‌హౌస్ సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్.జె. బాలాజీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కరుప్పు రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయింది. ఈ సమ్మర్ బాక్సాఫీస్ దగ్గర సూర్య విశ్వరూపం చూపించబోతున్నారు!"

ఈ సినిమాని మే 14 న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం.. దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య , త్రిష జంటగా మన ముందుకు రాబోతున్నారు. 'మౌనం పేసియాదే', 'ఆరు' సినిమాల తర్వాత వీరిద్దరి కెమిస్ట్రీని వెండితెరపై చూడటం ఫ్యాన్స్‌కి ఒక ఐ-ఫీస్ట్ అని చెప్పాలి."

ఇక ఈ సినిమాలో సూర్య పాత్ర గురించి చెప్పాలంటే.. ఆయన 'శరవణన్' అనే ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. కానీ ఇది కేవలం కోర్టు రూమ్ డ్రామా మాత్రమే కాదు. ఒకవైపు అపారమైన దైవభక్తి, మరోవైపు సమాజంలోని అన్యాయాల మీద తిరగబడే ఆవేశం.. ఈ రెండింటి కలయికే ఈ కరుప్పు ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో సూర్య మేకోవర్, ఆ ఇంటెన్స్ లుక్స్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది."

దర్శకుడు ఆర్.జె. బాలాజీ ఈ కథను చాలా కొత్తగా, నేటి కాలానికి తగ్గట్టుగా మలిచారు. ఇక రీసెంట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ అందించిన మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మేజర్ అసెట్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సమ్మర్ హీట్‌ని తట్టుకోవడానికి సూర్య కరుప్పు రూపంలో ఒక అదిరిపోయే యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతున్నారు."

PolitEnt Media

PolitEnt Media

Next Story