పోస్టర్ రిలీజ్

Kollywood star hero Suryaహీరోగా నటిస్తున్న 45వ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఇవాళ సూర్య 45వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేస్తూ, పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.నటుడు ఆర్జే బాలాజీ (RJ Balaji)..ఈ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి “కరుప్పు”అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. 'కరుప్పు' అంటే తమిళంలో నలుపు అని అర్థం. కానీ, ఈ సినిమా టైటిల్ పోస్టర్ పూర్తిగా రెడ్ కలర్ లుక్‌లో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది.

ఇందులో సూర్య వెనక్కి తిరిగి, చేతిలో కత్తి పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇది పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని స్పష్టమవుతోంది. అలాగే, పోస్టర్లో ఓ భారీ విగ్రహం, త్రిశూలాలు, ఆయుధాలతో కూడిన గర్భగుడి.. వంటివి సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.

ఈ సినిమాలో సూర్యకి జోడిగా స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) నటిస్తుంది. అయితే.. సూర్య, త్రిష ఇద్దరు కలిసి 2005లో చేసిన ఆరు సినిమా తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు. అంటే 19 ఏళ్ల తర్వాత ఈ జంట స్క్రీన్ పై మెరువబోతుందన్నమాట

PolitEnt Media

PolitEnt Media

Next Story