సూర్య విశ్వరూపం..

Suriya’s Powerful Transformation: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష.. ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘వీరభద్రుడు’. తమిళంలో ‘కరుప్పు’ పేరుతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం.. తెలుగులో ‘వీరభద్రుడు’గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ధూమ్ రేపుతోంది.
ట్రైలర్ చూస్తుంటే ఇదొక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ అని అర్థమవుతోంది. లాయర్ ముసుగులో రౌడీయిజం చేసే బేబీ కృష్ణ అనే విలన్‌కు.. హీరో తనదైన శైలిలో ఎలా బుద్ధి చెప్పాడు అనేదే ఈ సినిమా మెయిన్ ప్లాట్. ఇందులో సూర్య రెండు విభిన్న కోణాల్లో నట విశ్వరూపం ప్రదర్శించారు. ఒకవైపు సామాన్యుల పక్షాన పోరాడే పవర్‌ఫుల్ లాయర్‌గా, మరోవైపు దుష్టశిక్షణ చేసే వీరభద్రుడిగా సూర్య యాక్షన్ అదిరిపోయింది.
దర్శకుడు ఆర్జే బాలాజీ ఈ కథకు సోషల్ మెసేజ్‌తో పాటు ఒక ఇంట్రెస్టింగ్ డివోషనల్ టచ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక ఈ సినిమాను టాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్ 'అన్నపూర్ణ స్టూడియోస్' తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
సూర్య-త్రిష కెమిస్ట్రీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిసిన ఈ ‘వీరభద్రుడు’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంద్రన్స్, నట్టి, అనఘ, సుప్రీత్ రెడ్డి వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.మరి మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంలో సూర్య రుద్రతాండవం ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

