ఫ్యాన్స్‌కు పూనకాలే

Surprise Video Released from Pawan Kalyan’s Banner: పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుండి ఒక పవర్‌ఫుల్ వీడియోను విడుదల చేశారు. పూర్తి జపనీస్ మార్షల్ ఆర్ట్స్ థీమ్‌తో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

జపనీస్ సంస్కృతిని ప్రతిబింబించే ఎర్రటి సూర్యుడు, జపనీస్ అక్షరాలు మరియు ఒళ్లు గగుర్పొడిచే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ ప్రచార చిత్రం మొదలైంది. వీడియో చివరలో 'PK' లోగో ఉన్న టీ-షర్ట్ ధరించి, చేతిలో పదునైన కటానాకత్తి పట్టుకున్న పవన్ కల్యాణ్ లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ముఖ్యంగా గాలిలోకి ఎగిరి పవన్ ఇచ్చిన పవర్‌ఫుల్ కిక్ చూస్తుంటే, పాత జానీ, తమ్ముడు రోజులు గుర్తొస్తున్నాయని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ టు ఫామ్?

పవన్ కల్యాణ్ కెరీర్ మొదట్లో మార్షల్ ఆర్ట్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అదే జానర్‌లో పవన్ కనిపిస్తుండటంతో ఇది సినిమానా? వెబ్ సిరీసా? లేక తన ప్రొడక్షన్ బ్యానర్‌ను కొత్త హంగులతో రీ-లాంచ్ చేస్తున్నారా? అనే ఉత్కంఠ నెలకొంది.

రాజకీయాలతో పాటు సినిమాలూ షురూ..

ఒకవైపు డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, పవన్ తన సినీ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ ఏడాది వేసవికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డితో సినిమాకు ఇటీవలే ఈ క్రేజీ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story