Suryakanthamma’s Role Cannot Be Remade: సూర్యకాంతమ్మ పాత్రను రీమేక్ చేయలేరు
రీమేక్ చేయలేరు

Suryakanthamma’s Role Cannot Be Remade: ‘‘గుండమ్మ కథ సినిమా మళ్ళీ తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆవిడ పాత్ర పోషించేవారు లేక రీమేక్ చేయలేకపోయారు.. అది సూర్యకాంతమ్మ బ్రాండ్” అన్నారు బ్రహ్మానందం. మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన సూర్యకాంతం శత జయంతి పురస్కారాల ముగింపు వేడుకలో ఆయన సూర్యకాంతం స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్‌తో కలిసి డా.సూర్యకాంతం శతజయంతి కమిటీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ ‘‘హై హై నాయక, పవిత్ర బంధం, బంధువులు వస్తున్నారు జాగర్త లాంటి చిత్రాల్లో సూర్యకాంతం గారితో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఆమె నటనలో అత్త, వ్యక్తిగా అమ్మ, అందుకే ఆమె అత్త కాదు అత్తమ్మ. అలాంటి ఓ గొప్ప నటి పేరిట ఇస్తున్న ఈ అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. నటులు మురళీ మోహన్, రోజా రమణి, తనికెళ్ల భరణి, ఆలీ, దర్శకుడు రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొని సూర్యకాంతం నటనా చాతుర్యంతో పాటు ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

