Actor Vishal: తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ మరియు సినీ పరిణామాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. సోషల్ మీడియా వేదికగా సినిమా నటీనటులపై అసభ్యకరంగా ప్రవర్తించే యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కోరారు.

ఓ ఈవెంట్‌లో పాల్గొన్న విశాల్.. రాజకీయ నాయకులు, ప్రముఖులపై వస్తున్న ట్రోల్స్, యూట్యూబ్ ఛానెళ్ల తీరుపై తీవ్రంగా స్పందించారు. నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కావడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాజకీయ నాయకులు ఎవరైనా హద్దులు మీరి మాట్లాడితే చట్టపరమైన చర్యలుంటాయని పేర్కొన్న విశాల్.. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీలోని సీనియర్ నటీనటులు, హీరోయిన్లను లక్ష్యంగా చేసుకుని యూట్యూబ్‌లో నీచమైన కామెంట్లు చేసే వారి సంగతేంటని ప్రశ్నించారు.

ఎలాంటి మొహం చూపించకుండా, కేవలం డబ్బుల కోసం ఇష్టానుసారంగా మాట్లాడే అలాంటి ఆన్‌లైన్ ఛానెళ్లు, యూట్యూబర్లపై ఉక్కుపాదం మోపాలని సీఎం విజయ్‌కు విజ్ఞప్తి చేశారు. తెర వెనుక నుంచి అసభ్యకర వీడియోలు పోస్ట్ చేస్తూ నటీనటుల పరువు తీసే వారిపై కఠినమైన నిషేధం విధించాలని, తద్వారా ఇండస్ట్రీకి రక్షణ కల్పించాలని విశాల్ కోరారు. ప్రస్తుతం విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story