తమిళనాడు బీజేపీ చీఫ్

Actress Trisha: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, నటి త్రిషకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.ఇటీవల ఒక రాజకీయ సమావేశంలో నైనార్ నాగేంద్రన్, నటుడు , రాజకీయ నాయకుడు విజయ్ (TVK అధినేత) పై విమర్శలు చేస్తూ మధ్యలో త్రిష పేరును ప్రస్తావించారు. "విజయ్ రాజకీయాల్లో రాణించాలంటే ముందు త్రిష ఇంటి నుండి బయటకు రావాలి, అప్పుడే అతనికి వాస్తవాలు తెలుస్తాయి" అని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించారు. తన లాయర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ: "రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, తనను ఇలాంటి వివాదాల్లోకి లాగవద్దని స్పష్టం చేశారు. "గౌరవం లేని చోట ప్రశ్నించడం అవసరం" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

త్రిష నుండి లీగల్ నోటీసులు రావడంతో పాటు, అన్ని రాజకీయ పార్టీలు (DMK, కాంగ్రెస్), సినీ ప్రముఖుల నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో నైనార్ నాగేంద్రన్ వెనక్కి తగ్గారు."నా వ్యాఖ్యలు పొరపాటున చేసినవి నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను" అని ఆయన ప్రకటించారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.రాజకీయ నాయకులు సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను విమర్శల కోసం వాడుకోవడంపై ప్రస్తుతం తమిళనాడులో పెద్ద చర్చ జరుగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story