Kantara: కాంతారా: చాప్టర్ 1 సినిమా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రేపు హైదరాబాద్‌లోని జేఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరగనుంది.. దర్శకుడు, కథానాయకుడు రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ మంచి స్నేహితులు కావడంతో ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఇటీవలే "కాంతారా: చాప్టర్ 1" ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా, ఇప్పుడు ఎన్టీఆర్ రాకతో ఈవెంట్‌కు, సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.
సినిమా ట్రైలర్ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఇప్పటికే రిలీజై యూట్యూబ్ లో రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్ నెలకొంది. దీనికి తగినట్లుగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
