Tarak’s Ruthless Avatar as ‘Luger’ in Dragon: డ్రాగన్ లో లూగర్ గా తారక్ ఊచకోత.. అసలు అర్థం ఏంటో తెలుసా?
అసలు అర్థం ఏంటో తెలుసా?
Tarak’s Ruthless Avatar as ‘Luger’ in Dragon: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీపై ఎట్టకేలకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు డ్రాగన్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఈ గ్లింప్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర పేరును లూగర్ అని పరిచయం చేయడంతో అభిమానుల్లో అంచనాలు స్కై హైకి చేరాయి.
లూగర్ వెనుక ఉన్న పవర్‌ఫుల్ సీక్రెట్!
కేజీఎఫ్ లో రాకీ భాయ్, సలార్ లో దేవా లాంటి ఐకానిక్ క్యారెక్టర్లను సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు తారక్ కోసం లూగర్ అనే పేరును ఎంచుకోవడం వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ రీజన్ ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్, వికీపీడియా సమాచారం ప్రకారం.. లూగర్ అనేది ప్రపంచ యుద్ధాల కాలంలో జర్మనీ సైన్యం విరివిగా వాడిన ఒక క్లాసిక్ పిస్టల్. అత్యంత కచ్చితమైన గురి, ప్రాణాంతకమైన వేగానికి ఈ ఆయుధం పెట్టింది పేరు. దీనిని బట్టి సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కేవలం ఒక వ్యక్తిలా కాకుండా శత్రువులను ఏరిపారేసే ఒక మారణాయుధంలా సాగబోతోందని స్పష్టమవుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుండి అధికారిక వివరణ రావాల్సి ఉంది.
డ్రాగన్ మూవీ స్టోరీ లైన్ - ముఖ్యాంశాలు
అంతర్జాతీయ మాఫియా బ్యాక్‌డ్రాప్:
ఈ సినిమా 1967 కాలం నాటి అంతర్జాతీయ ఓపియం (నల్లమందు) స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా. బ్రిటిష్ వారు భారతదేశం విడిచి వెళ్లాక, ఓపియం వ్యాపారం ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలుగా విడిపోతుంది. ఈ రెండు గ్యాంగుల మధ్య జరిగే ఆధిపత్య పోరు, రక్తపాతం చుట్టూ కథ తిరగనుంది. ఇందులో ఎన్టీఆర్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన చీఫ్ వేటగాడిగా అత్యంత వైల్డ్ లుక్‌లో కనిపించబోతున్నారు.
క్రేజీ కాస్టింగ్ - రిలీజ్ డేట్ లాక్!
ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత కథానాయికగా నటిస్తోంది. అలాగే, నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్ అనే పవర్‌ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతున్న ఈ డ్రాగన్ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

