నేషనల్ అవార్డ్

National Award: బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు సాంగ్ కు నేషనల్ అవార్డు దక్కింది. గీత రచయిత కాసర్ల శ్యామ్ ఈ పాటకు 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో "ఉత్తమ గీత రచయిత" అవార్డును గెలుచుకున్నారు. ఈ పాట చాలా మంది ప్రేక్షకులను కదిలించి, సినిమా విజయానికి కూడా ఎంతగానో దోహదపడింది. ఈ పాటలో తెలంగాణ సంస్కృతి, భావోద్వేగాలు చక్కగా ప్రతిబింబించాయి.

కాసర్ల శ్యామ్ రాసిన ఊరు పల్లెటూరు సాంగ్ కు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా రామ్ మిరాయాల పాడారు. పాట థీమ్ ఏంటంటే.. తెలంగాన ఆటపాటలు,సంస్కృతి, సంబంధాలు, ఆప్యాయతలు, ఆత్మీయులను కోల్పోయినప్పుడు కలిగే బాధను, జ్ఞాపకాలను హత్తుకునే ఈ పాటను రాశారు.

ఉత్తమ గీత రచయితగా కేటగిరిలో తెలుగు సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం ఇది ఐదోసారి గతంలో తెలుగు వీర లేవరా.. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. ఠాగూర్ లోని నేను సైతం,కొండపొలంలోని ధం ధం ధం పాటకు గాను గీత రచయితలు నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story