Telangana Gaddar Film Awards-2024 Announcement

సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో సినీ అవార్డుల పండుగ మొదలుకాబోతోంది. తెలంగాణ గద్దర్ అవార్డుల వివరాలను జ్యూరీ ఈ రోజుహైదరాబాద్లో ప్రకటించింది. గద్దర్ అవార్డుల జ్యూరీగా సీనియర్ నటి జయసుధను నియమించింది. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి అవార్డుల జాబితా ప్రకటించారు. మార్చి 13 నుంచి అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించి ఈరోజు ఉదయం అవార్డులను ప్రకటించింది. 2024 సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రానికి గద్దర్ అవార్డును ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప-2), ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో సినిమాగా పొట్టేల్, ఉత్తమ మూడో సినిమగా లక్కీ భాస్కర్ చిత్రాలను అవార్డులను ప్రకటించారు.

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 ప్రకటన

ఉత్తమ మొదటి చిత్రం కల్కి

ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్

ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్

ఉత్తమ బాలల చిత్రం-35 ఇది చిన్న కథ కాదు

ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు-రజాకార్

ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప-2)

ఉత్తమ దర్శకుడు - నాగ్ అశ్విన్ (కల్కి)

ఉత్తమ నటి - నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)

ఉత్తమ గాయని - శ్రేయా ఘోషల్ (పుష్ప-2)

ఉత్తమ స్క్రీన్ ప్లే-వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ హాస్యనటులు - వెన్నెల కిషోర్, సత్య

ఉత్తమ కొరియోగ్రాఫర్ - గణేష్ ఆచార్య (దేవర)

ఉత్తమ కథా రచయిత - శివ పాలడుగు

ఉత్తమ పుస్తకం - రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం)

స్పెషల్ జ్యూరీ అవార్డు - అనన్య నాగళ్ల (పొట్టేల్)

స్పెషల్ జ్యూరీ - దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)

స్పెషల్ జ్యూరీ - ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2)

జూన్ 14న హైటెక్స్లో అవార్డుల ప్రదానం

2014---23 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను..త్వరలో ప్రకటిస్తామని జ్యూరీ చైర్పర్సన్ జయసుధ వెల్లడించారు. పారదర్శకంగా అవార్డులను ఎంపిక చేశామని జయసుధ చెప్పారు. అవార్డులు తమకు బూస్ట్ ఇస్తాయని.. ప్రభుత్వం తమకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క , కోమటిరెడ్డి , దిల్ రాజు‌కు ధన్యవాదాలు తెలియజేశారు. 14 ఏళ్ల అనంతరం అవార్డులు ఇవ్వటం సంతోషమన్నారు. బెస్ట్ ఆఫ్ బెస్ట్ కే అవార్డులు వస్తున్నాయన్నారు. జూన్ 14న హైటెక్స్‌లో అవార్డుల ప్రదానం జరుగుతుందన్నారు.

Updated On 29 May 2025 12:22 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story