తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు టికెట్ల ధర పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లలో రూ.50(జీఎస్టీతో కలిపి), మల్టీఫ్లెక్సుల్లో రూ. 100 (జీఎస్టీతో కలిపి)పెంచుకునేందుకు అనుమతిచ్చింది. జనవరి 12 నుంచి వారం రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది.జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతిచ్చింది ప్రభుత్వం. ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది.

ఏపీలోనూ ఈ సినిమా జనవరి 11 (ఆదివారం) రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్య ఒక ప్రత్యేక షో వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర: రూ. 500/- (GSTతో కలిపి). రెగ్యులర్ షోల టికెట్ ధరలు (మొదటి 10 రోజులు) జనవరి 12 నుండి పది రోజుల పాటు సాధారణ ధరల కంటే అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించారు. సింగిల్ స్క్రీన్స్ లో సాధారణ ధర కంటే రూ. 100- అదనంగా పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ లలో రూ. 125/- అదనంగా పెంచుకోవచ్చు. ఈ 10 రోజుల కాలంలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

"మన శంకర వరప్రసాద్ గారు" (అనిల్ రావిపూడి దర్శకత్వం) సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా..విక్టరీవెంకటేష్ అతిథి పాత్రలో నటిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story