Telugu Cinema: నాగ్అశ్విన్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా!
రజనీకాంత్ సినిమా!

Telugu Cinema: తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సినిమా తీయబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. కల్కి 2898 ఏడీతో భారీ విజయాన్ని అందుకున్న నాగ్ అశ్విన్, ఇటీవల రజనీకాంత్‌ను కలిసి ఒక కథాంశాన్ని వినిపించారని సమాచారం. నాగ్ అశ్విన్ చెప్పిన పాయింట్ రజనీకాంత్‌కు బాగా నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని ఆయన సూచించారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై రజనీకాంత్ సానుకూలంగా స్పందించడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ సినిమాకు వైజయంతీ మూవీస్ బ్యానర్ పతాకంపై అశ్వినీదత్ నిర్మాణ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.'కల్కి 2898 ఏడీ' సినిమా సీక్వెల్ అయిన 'కల్కి 2' ఆలస్యం అవుతుండటంతో, నాగ్ అశ్విన్ ఈ గ్యాప్‌లో రజనీకాంత్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అయితే, టాలీవుడ్‌లో వైవిధ్యభరిత చిత్రాలు తీసే నాగ్ అశ్విన్, కోలీవుడ్ దిగ్గజం రజనీకాంత్‌తో సినిమా తీస్తే అది ఒక సంచలన ప్రాజెక్ట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
