భగవంత్ కేసరికి నేషనల్ అవార్డ్

National Awards for Telugu Cinema: నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమాల హవా కనిపించింది. ఈ సారి హనుమాన్ మూవీ ఉత్తమ యాక్షన్ , ఉత్తమ యానిమేషన్ ,విజువల్ ఎఫెక్ట్ విభాగాల్లో అవార్డులకు ఎంపిక కాగా.. బేబీ సినిమాకు స్క్రీన్ ప్లే కు అవార్డు వచ్చింది అలాగే ఉత్తమ బాలనటిగా డైరెక్టర్ సుకుమార్ కూతురు సకృతి వేణి జాతీయ స్థాయిలో గాంధీతాత చెట్టు చిత్రంతో బాలనటిగా అవార్డు వచ్చింది. అలాగే బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు సాంగ్ కు నేషనల్ అవార్డులు వచ్చాయి.

ఉత్తమ తెలుగు చిత్రం

బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు దక్కింది. 2023లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ముఖ్యంగా మహిళలకు సంబంధించిన "గుడ్ టచ్, బ్యాడ్ టచ్" వంటి అంశాలను ప్రస్తావించి మంచి మెసేజ్ ను అందించింది. నందమూరి బాలకృష్ణ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణ "నేలకొండ భగవంత్ కేసరి" అనే పాత్రను పోషించారు. ఆయన ఒక జైలర్ కూతురైన విజయలక్ష్మి (శ్రీలీల) బాధ్యతను తీసుకుని, ఆమెను సైన్యంలో చేర్పించడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆయనకు ఒక పవర్ ఫుల్ వ్యాపారవేత్త అయిన రాహుల్ సంఘ్వి (అర్జున్ రాంపాల్)తో సమస్యలు ఎదురవుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story