“Telusu Kada” Arrives on OTT: ఓటీటీలోకి తెలుసు కదా
తెలుసు కదా

“Telusu Kada” Arrives on OTT: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'తెలుసు కదా' అక్టోబర్ 17న విడుదలైన తెలుసు కదా సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో యూత్ ను మెప్పించే అంశాలు కొన్ని ఉన్నాయి. అలాగే సిద్దు నటన,హీరోయిన్ల అంద చందాలు, పాటలు, వైవా హర్ష కామెడీ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన తెలుసు కదా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో నవంబర్ 14న స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఈ రొమాంటిక్ డ్రామాకి నీరజ కోన దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్,కృతి ప్రసాద్ నిర్మించారు.
ఇది ఒక ముక్కోణపు ప్రేమకథ (Love Triangle) .. కథానాయకుడు తన జీవితంలో ఉన్న ఇద్దరు ముఖ్యమైన మహిళల మధ్య తన ప్రేమను, నిర్ణయాన్ని ఎలా ఎంచుకుంటాడు అనే భావోద్వేగ అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.దర్శకురాలు నీరజ కోన, గతంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఇది ఆమె మొట్టమొదటి దర్శకత్వ ప్రయత్నం. ఒక మహిళా దర్శకురాలిగా, ఆమె ఈ ప్రేమకథను సున్నితమైన, భిన్నమైన కోణంలో చూపించే ప్రయత్నం చేసింది

