‘Jailer 2’: బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైంది! సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో.. సంచలన విజయం సాధించిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'జైలర్ 2' తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ బిగ్ అప్డేట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ ముగిసిన సందర్భంగా సెట్‌లో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్న కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో రజనీకాంత్ స్టైలిష్ లుక్ చూసి 'తలైవా ఈజ్ బ్యాక్' అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

మొదటి భాగం ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ క్రేజ్‌ను రెట్టింపు చేసేలా నెల్సన్ ఈ పార్ట్-2ని తీర్చిదిద్దారు. కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ మరోసారి మెరవనున్నారు. వీరితో పాటు రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అంటే ఈసారి కూడా దక్షిణాది స్టార్ హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో కనువిందు చేయబోతున్నారన్నమాట!

మొదటి భాగంలో టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ చూపించిన విశ్వరూపం ఒక ఎత్తైతే.. సీక్వెల్‌లో దానికి మించిన యాక్షన్ , ఎమోషన్ ఉండబోతున్నట్లు టాక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో.. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అనిరుధ్ రవిచందర్ అందించే మ్యూజిక్ ఈ సినిమాకు మరో మేజర్ హైలైట్ కానుంది.షూటింగ్ ముగిసింది.. ఇక బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ గర్జన మొదలవ్వడమే తరువాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రానుంది. మరి 'జైలర్ 2'తో రజనీకాంత్ ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో వేచి చూడాల్సిందే!

PolitEnt Media

PolitEnt Media

Next Story