‘Jana Nayagan’: కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అభిమానులకు ఎట్టకేలకు ఒక సంచలన శుభవార్త వచ్చేసింది. దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన ఆయన కెరీర్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన చివరి చిత్రం... 'జన నాయగన్' (తెలుగులో: జననాయకుడు) సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.

తీవ్ర రాజకీయ, సామాజిక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'ఏ' (A) సర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాదు, ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 183 నిమిషాలు, అంటే 3 గంటల మూడు నిమిషాలుగా ఖరారైంది. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా... మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో మెరవనున్నారు.

నిజానికి ఈ ఏడాది సంక్రాంతికే థియేటర్లలోకి రావాల్సిన ఈ మూవీ... కొన్ని సెన్సార్ వివాదాలు, కోర్టు కేసులు, సుదీర్ఘ వాయిదాల కారణంగా లేట్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు అన్ని అడ్డంకులూ తొలగిపోవడంతో... 'జన నాయగన్' గ్రాండ్ రిలీజ్‌కు మార్గం సుగమమైంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత విడుదలవుతున్న చివరి సినిమా కావడంతో... దీనిపై అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో అంచనాలు స్కై హైలో ఉన్నాయి. ఈ రిలీజ్ డేట్‌పై నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story