Thama Trailer Sends Chills: భయపెడుతోన్న థామా ట్రైలర్
థామా ట్రైలర్

రష్మికా మందాన, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ హారర్-కామెడీ చిత్రం 'థామా' ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ హారర్, -కామెడీ చిత్రం ట్రైలర్ ను ముంబైలో జరిగిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. రిలీజైన 16 గంటల్లో యూ ట్యూబ్ లో ట్రైలర్ 7.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రంలో రష్మికా మందాన నటించినందుకు ఆమె అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
Thama Trailer Sends Chills: ఈ సినిమా 'మడాక్ హారర్ కామెడీ యూనివర్స్'లో భాగంగా వస్తోంది. 'స్త్రీ', 'భేదియా', 'ముంజ్య' వంటి చిత్రాల మాదిరిగానే 'థామా' కూడా హారర్, కామెడీని మిక్స్ చేస్తుంది. ఈ కథాంశం ఒక వేటగాడు (Ayushmann Khurrana) , ఒక విలక్షణమైన అమ్మాయి (రష్మికా మందాన) మధ్య సాగుతుంది. వీరి జీవితాలు ఒక శాపం కారణంగా కలవడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఆయుష్మాన్ , రష్మికతో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ , సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 21, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
