Nitin: తమ్ముడు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nitin:హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం తమ్ముడు. డైరెక్టర్ శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తోన్న ఈసినిమా జులై 4న బాక్సాఫీసు ముందుకు రానుంది. కన్నడ నటి సప్తమి గౌడ హీరోయిన్. లయ, స్వాసిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సన్దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీకి అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. తాజాగా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేసింది. 'నేను అడగడం వల్లే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ వి షయంలోనూ అంతే' అని హీరోయిన్ సప్తమీ గౌడ, స్వాసిక చెబుతారు. ఈ మాట విన్న లయ 'అసలు మీరిద్దరు ఎవరు?' అని ప్రశ్నించింది. 'వేరే సినిమాలో నటించి..'తమ్ముడు' అను కున్నారా?' అంటూ వర్ష బొల్లమ్మ నవ్వులు పూయించారు. చివరిలో డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఎంట్రీ ఇచ్చి.. అన్నింటికీ సమాధానం ట్రైలర్ అని, అది ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు విడుదలవుతుందని తెలిపారు. మరోవైపు ఈ సారి ఎలాగైన హిట్ కొట్టి.. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని నితిన్ భావిస్తున్నాడు. చాలా రోజులుగా సరైన హిట్ లేని నితిన్.. ‘రాబిన్ హుడ్’ తో సూపర్ హిట్ కొట్టాలనుకున్నాడు. కానీ ఈ మూవీ ప్లాప్ అయ్యింది. దాంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టి.. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని నితిన్ భావిస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా నితిన్ కు కలిసొస్తుందో లేదో చూడాలి.
